‘అలా అయితేనే..ట్రంప్‌ ఫలితాల్ని స్వీకరిస్తారు’

ఎన్నికల్లో తాను ఓడిపోతే అధికార బదిలీ అంత ప్రశాంతంగా జరగకపోవచ్చునన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరతీశాయి. దీంతో శ్వేతసౌధం ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది............

Published : 25 Sep 2020 09:14 IST

అధ్యక్షుడి వ్యాఖ్యల దుమారంపై శ్వేతసౌధం వివరణ

వాషింగ్టన్‌: ఎన్నికల్లో తాను ఓడిపోతే అధికార బదిలీ అంత ప్రశాంతంగా జరగకపోవచ్చునన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరతీశాయి. దీంతో శ్వేతసౌధం ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అన్నీ సజావుగా, పారదర్శకంగా జరిగితే ట్రంప్‌ ఎన్నికల ఫలితాల్ని స్వీకరిస్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎన్నికల ఫలితాల్ని అంగీకరించరబోమని డెమోక్రాటిక్‌ పార్టీ నాయకులే పదే పదే అంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాల్ని ఎలా స్వీకరించబోతున్నారని వారినే ప్రశ్నించాలని విలేకరులకు హితవు పలికారు. ‘ట్రంప్‌ గెలిస్తే ఫలితాల్ని అంగీకరించేది లేదం’టూ పలు సందర్భాల్లో డెమోక్రాటిక్‌ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యల్ని ఉటంకించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌లపై మొదటి నుంచి తనకు అభ్యంతరాలు ఉన్నాయని ట్రంప్‌ గురువారం మరోసారి అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఓడితే అధికార బదిలీ విషయంలో ఏమవుతుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఫలితాలపై సుప్రీంకోర్టు వరకు వెళ్లవచ్చన్నారు. దీంతో ఆయన మాటలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్‌ ఓటమిని అంగీకరించరని.. శ్వేతసౌధాన్ని వీడేందుకు నిరాకరిస్తారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని