Lakhimpur Kheri: కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ అరెస్ట్‌

లఖింపుర్‌ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర అరెస్టయ్యారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు శనివారం రాత్రి 11 గంటలకు ఆశిష్‌ మిశ్రను అరెస్టు చేశారు.

Updated : 24 Sep 2022 16:29 IST

ఉత్తరప్రదేశ్‌: లఖింపుర్‌ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర అరెస్టయ్యారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు శనివారం రాత్రి 11 గంటలకు ఆశిష్‌ మిశ్రను అరెస్టు చేశారు. ఈ నెల 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్ర పేరును పోలీసులు చేర్చారు. ఇందులో భాగంగా ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి ఆశిష్‌ మిశ్ర విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారమే అతడు పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయాడని ఆయన తండ్రి అజయ్‌ మిశ్ర తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం క్రైం బ్రాంచ్‌ పోలీసుల ఎదుట ఆశిష్‌ హాజరయ్యారు. దీంతో పోలీసులు అశిష్‌ మిశ్రాను 11 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్‌ చేశారు. అయితే విచారణలో ఆశిష్‌ మిశ్ర సహకరించలేదని పోలీసులు తెలిపారు. మేం అడిగిన ప్రశ్నలకు అతను సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. ఆశిష్‌ మిశ్రను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని