Published : 14/12/2020 17:54 IST

బైడెన్‌ ప్రమాణ స్వీకారం: ట్రంప్‌ హాజరయ్యేనా?

అలా చేస్తే ట్రంప్‌ నాలుగోవారు..

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ జనవరి 20న పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరవుతారా? అనే విషయం ఇప్పటికీ ప్రశ్నార్ధకంగానే నిలిచింది. అసలు బైడెన్‌ విజయాన్నే ఇంతవరకు అంగీకరించని ట్రంప్‌.. ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే విషయాన్ని ఇప్పటి వరకూ ప్రకటించలేదు. దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ ఆదివారం ట్రంప్‌ను ప్రశ్నించగా.. తాను ఆ విషయంపై మాట్లాడదల్చుకోలేదని జవాబిచ్చారు. అందుకు బదులుగా తన గొప్పదనాన్ని గురించి చెప్పుకొచ్చారు. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు ఏ అధ్యక్షుడూ సాధించనన్ని ఓట్లను తాను గెల్చుకున్నానని.. ఈ సంఖ్య ఒబామా కంటే 75 మిలియన్లు ఎక్కువని ఆయన వెల్లడించారు. అయినా తాను ఎన్నికల్లో ఓడిపోయానంటున్నారంటూ అధ్యక్షుడు ఆక్రోశం వ్యక్తం చేశారు. తనకు తక్కువ ఓట్లు వస్తే ఓడిపోయినట్టు ఒప్పుకునేవాడినని.. నిజానికి తాను ఓడిపోలేదన్నారు. న్యాయబద్ధం కాని అధ్యక్షుడు అమెరికాను పాలించబోవటం తనకు ఆందోళన కలిగిస్తోందని ట్రంప్‌ అన్నారు.

అలా చేస్తే ట్రంప్‌ నాలుగోవారు..

ఇదిలా ఉండగా బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరు కానట్లయితే.. ఆ విధంగా చేసిన నాలుగో అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచిపోనున్నారు. ఇప్పటి వరకు అగ్రరాజ్యానికి 44 మంది అధ్యక్షత వహించగా.. వారిలో జాన్‌ ఆడమ్స్‌, జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌, ఆండ్రూ జాన్సన్‌లు మాత్రమే తమ తర్వాతి అధ్యక్షుడైన వారికి స్వయంగా అధికారం అప్పగించేందుకు హాజరు కాలేదు.

బైడెన్‌ ఏమన్నారంటే..

ఇదిలా ఉండగా తన ప్రమాణ స్వీకారానికి  ట్రంప్‌ హాజరవుతారని బైడెన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ విధంగా చేయటం ద్వారా అమెరికా ఇతర దేశాలకు మార్గదర్శకంగా నిలువగలదని ఆయన అన్నారు.  అది పూర్తిగా ట్రంప్‌ వ్యక్తిగతం అయినప్పటికీ.. అనంతర కాలంలో వైరుధ్యాలను నిరోధించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని బైడెన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. లాంఛనంగా అధికార మార్పిడి జరిగే సమయంలో అధ్యక్షుడి హాజరు తనపై వ్యక్తిగతంగా ప్రభావం చూపకపోయినా.. దేశ ప్రజలపై ఉంటుందని ఆయన అన్నారు. నియంతృత్వ ప్రభుత్వాల్లో మాత్రమే ఈ విధంగా అధికార బదలాయింపు పట్ల వ్యతిరేకత ఉంటుందని కాబోయే అధ్యక్షుడు పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

ట్రంప్‌ చివరి ప్రయత్నమూ విఫలం

24 గంటల్లోపే మొదటి టీకా.. ట్రంప్‌

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని