Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో కొత్త ఏజెన్సీ.. ఎందుకంటే!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించేందుకు కొత్తగా ‘స్టేట్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎస్‌ఐఏ)’ని ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పోలీసుతోనే ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రదాడులు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, తప్పుడు ప్రచారాలు చేసి

Published : 02 Nov 2021 16:57 IST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను త్వరితగతిన విచారించేందుకు కొత్తగా ‘స్టేట్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎస్‌ఐఏ)’ని ఏర్పాటు చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పోలీసులతోనే ఈ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రదాడులు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం, తప్పుడు ప్రచారాలు చేసి అరెస్టైన వారి కేసులను ఈ ఏజెన్సీ విచారించనుంది. అలాగే.. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు సహాయసహకారాలు అందిస్తుంది. 

జమ్ముకశ్మీర్‌లోని ఏ పోలీస్‌స్టేషన్‌లోనైనా ఉగ్రవాదానికి సంబంధించి కేసు నమోదైతే వెంటనే ఆయా పోలీస్‌స్టేషన్‌లోని పోలీసులు ఎస్‌ఐఏకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఉగ్రవాద కేసులను ఎన్‌ఐఏ విచారించని పక్షంలో ఎస్‌ఐఏ విచారణకు స్వీకరిస్తుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ), పేలుడు పదార్థాలు, అటామిక్‌ ఎనర్జీ, యాంటీ-హైజాకింగ్‌, టెర్రర్‌ కాన్‌స్పిరసీ, టెర్రర్‌ ఫైనాన్సింగ్‌, ఇతర ఉగ్రవాదానికి సంబంధించిన కేసులపై ఎస్‌ఐఏ విచారణ చేపట్టనుంది. ఈ విభాగానికి సీఐడీ చీఫ్‌ ఎక్స్ అఫిషియో డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఎస్‌ఐఏలో విధులు నిర్వర్తించే పోలీసులకు వారి మూలవేతనంలో 25 శాతం అదనంగా ఇవ్వనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని