Agni: అగ్ని ప్రైమ్‌ ప్రయోగం విజయవంతం

అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆధునిక అగ్ని ప్రైమ్‌ క్షిపణిని నేడు భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భాగమైన దీన్ని ఒడిశా తీరంలో పరీక్షించారు.

Updated : 28 Jun 2021 13:42 IST

భువనేశ్వర్‌: అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఆధునిక అగ్ని ప్రైమ్‌ క్షిపణిని నేడు భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భాగమైన దీన్ని ఒడిశా తీరంలో పరీక్షించారు. షార్ట్‌ రేంజ్‌ బాలిస్టిక్ క్షిపణి అయిన ఇది 1000-1500 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదు. 1000 కిలోల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. రెండు స్టేజీలు గల ఈ క్షిపణి అగ్ని-1 కంటే తేలికగా ఉండడం విశేషం. 4000 కి.మీ రేంజ్‌ కలిగిన అగ్ని-4, 5000 కి.మీ రేంజ్‌ కలిగిన అగ్ని-5 ఫీచర్లను సైతం అగ్ని ప్రైమ్‌లో మిళితం చేశారు. ఓవైపు కరోనా మహమ్మారిపై పోరులో.. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీర్‌డీఓ) క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే, మరోవైపు రక్షణ రంగ బాధ్యతలను సైతం సకాలంలో పూర్తి చేస్తుండడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని