Al Qaeda: మరోసారి అల్‌ జవహిరీ వీడియో ప్రసంగం.. ఐరాసపై తీవ్ర విమర్శలు!

ఏడాది క్రితమే అనారోగ్యంతో చనిపోయినట్లుగా వదంతులున్న అల్‌ఖైదా అగ్రనేత ఐమన్‌ అల్‌- జవహిరీ కొన్నాళ్ల కిందట ఓ వీడియోలో కనిపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఉగ్ర సంస్థ తన అధికారిక మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలోనూ...

Updated : 10 Aug 2022 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాది క్రితమే అనారోగ్యంతో చనిపోయినట్లుగా వదంతులున్న అల్‌ఖైదా అగ్రనేత అల్‌- జవహరీ కొన్నాళ్ల కిందట ఓ వీడియోలో కనిపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఉగ్ర సంస్థ తన అధికారిక మీడియాలో విడుదల చేసిన ఓ వీడియోలోనూ అతడు ప్రత్యక్షమయ్యాడు! ఐరాసతో ముప్పు పొంచి ఉందంటూ.. ఇస్లామిక్ దేశాలను హెచ్చరించడమే లక్ష్యంగా అతని ప్రసంగం సాగింది! అయితే.. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ రికార్డు చేశారనే విషయంపై స్పష్టత రాలేదు.

‘భూమిపై అతిపెద్ద నేరస్థులు వీరు..’

ప్రపంచంపై, మానవ జాతిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనే ఉద్దేశంతో రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన శక్తులు ఐరాసను సృష్టించినట్లు జవహిరీ పేర్కొన్నాడు. ఇస్లామిక్ షరియాకు విరుద్ధమైన భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నందున.. ఐరాస నిర్ణయాలను తిరస్కరించాలని సంబంధిత దేశాలకు పిలుపునిచ్చాడు. దీంతోపాటు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలవడంపై మండిపడ్డాడు. ఐరాస భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్యదేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికాలనూ విమర్శించాడు. ఈ దేశాలను భూమిపై అతిపెద్ద నేరస్థులుగా అభివర్ణించాడు. ఐరాసను ప్రభావితం చేస్తూ.. అందులోని గొప్ప స్థానాలను అనుభవిస్తున్నాయని ఆరోపణలు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని