Amit shah: సామాన్యుడికి ఊరట.. మోదీకి థాంక్స్‌: అమిత్‌ షా ట్వీట్‌

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న.......

Published : 04 Nov 2021 19:20 IST

దిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హర్షం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సున్నితమైందన్నారు. ఈ నిర్ణయం సామాన్యుడికి ఊరటనివ్వడమే కాకుండా ద్రవ్యోల్బణాన్ని కూడా తగ్గిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పలు భాజపా పాలిత రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింత తగ్గించేలా ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. 

దీపావళి కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ సామాన్య ప్రజలకు పెద్ద ఉపశమనం కలిగించారని అమిత్‌ షా పేర్కొన్నారు. లీటరు పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹10ల చొప్పున ఎక్సైజ్‌ సుంకం తగ్గించారని తెలిపారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ సామాన్యుడికి ఊరటనిచ్చేలా తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో సున్నితత్వంతో కూడినదనీ.. ఇందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, దేశంలో బిహార్‌తో పాటు పలు భాజపా పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో మండిపోతున్న ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కొంతవరకు ఊరట లభించినట్టైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని