Afghanistan: కాల్పులు, తొక్కిసలాటల్లో 20 మంది మృతి: నాటో

అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో.. స్థానికంగా పరిస్థితులు దయనీయంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లిపోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రాణాలకు తెగించి వారంతా కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు...

Published : 22 Aug 2021 18:36 IST

కాబుల్‌: అఫ్గాన్‌ను తాలిబన్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో.. స్థానికంగా పరిస్థితులు దయనీయంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశం విడిచి వెళ్లిపోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రాణాలకు తెగించి వారంతా కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు, పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదిలా ఉండగా.. కాల్పులు, తొక్కిసలాటల కారణంగా వారం వ్యవధిలో ఇక్కడ దాదాపు 20 మంది మరణించినట్లు నాటో అధికార ప్రతినిధి ఒకరు తాజాగా వెల్లడించారు. శనివారం సైతం ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు అఫ్గాన్‌ పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించినా.. అక్కడి విమానాశ్రయం మాత్రం ఇప్పటికీ అమెరికా బలగాల ఆధీనంలోనే ఉంది.  సుమారు 6 వేల మంది సైనికులు భద్రత కల్పిస్తున్నారు. ఆయా దేశాలు.. తమ పౌరులు, సిబ్బంది, శరణార్థుల తరలింపును ముమ్మరం చేశారు. భారత్‌ సైతం ప్రత్యేక విమానాలు నడుపుతోంది. ఆదివారం కూడా విమానాశ్రయానికి తాకిడి నెలకొంది. రద్దీని నియంత్రించేందుకు తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు ఓ వార్త సంస్థకు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని