France Vs Australia: ఆస్ట్రేలియా ప్రధాని అబద్ధాలు చెప్పారు..!

ఫ్రాన్స్‌-ఆస్ట్రేలియా మధ్య జలాంతర్గాముల కాంట్రాక్టుకు సంబంధించిన వివాదం మరింత ముదిరింది. రోమ్‌లో జీ-20 భేటీ ముగిసిన తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌

Updated : 02 Nov 2021 20:48 IST

 మాక్రోన్‌ వ్యాఖ్యలతో ముదిరిన ఫ్రాన్స్‌-ఆస్ట్రేలియా వివాదం

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఫ్రాన్స్‌-ఆస్ట్రేలియా మధ్య జలాంతర్గాముల కాంట్రాక్టుకు సంబంధించిన వివాదం మరింత ముదిరింది. రోమ్‌లో జీ-20 భేటీ ముగిసిన తర్వాత ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తనతో అబద్ధమాడారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్‌ మాత్రం ఈ వ్యాఖ్యలను తిరస్కరించారు. ‘మాక్రోన్‌ వ్యాఖ్యలు కేవలం నన్ను అన్నట్లు కాకుండా.. ఆస్ట్రేలియా మొత్తాన్ని అన్నట్లు ఉన్నాయి. ఆ ఆరోపణలు ఎదుర్కోవడానికి నాకు తగినంత సత్తా ఉంది’’ అని మారిసన్‌ పేర్కొన్నారు.  వేధింపులు, దూషణలను ఆస్ట్రేలియా ఏమాత్రం సహించదని పేర్కొన్నారు. 

ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా-యూకే‌-అమెరికా కలిసి ఆకస్‌ రక్షణ కూటమిగా ఏర్పడ్డాయి. ఈ  ఒప్పందంలో భాగంగా అమెరికా, యూకేలు ఆస్ట్రేలియా అణు జలాంతర్గాలములు సమకూర్చుకొనేట్లు సహకరిస్తాయి. దీంతో అప్పటికే ఫ్రాన్స్‌ నుంచి 12 డీజిల్‌-ఎలక్ట్రిక్‌ జలాంతర్గాములు కొనుగోలు చేసేందుకు ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకొంది. ఈ డీల్‌ విలువ 37 బిలియన్‌ డాలర్లు. కానీ, ఆకస్‌ డీల్‌ కారణంగా ఫ్రాన్స్‌-ఆస్ట్రేలియా ఒప్పందం రద్దైంది. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకొంది. ఆస్ట్రేలియా వెన్నుపోటు పొడిచిందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్‌ వ్యాఖ్యానించారు. తాజాగా జీ20 సందర్భంగా మాక్రోన్‌ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు