Covid: పశ్చిమ బెంగాల్‌లో బూస్టర్‌ డోసు ట్రయల్స్‌కు ఏర్పాట్లు!

కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. వైరస్‌ కట్టడి క్రమంలో బూస్టర్‌ డోసుపై కూడా అవి దృష్టి సారించాయి. భారత్‌ సైతం ఈ విషయమై రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని వెల్లడిస్తామని ఇదివరకే ప్రకటించింది...

Published : 03 Dec 2021 23:38 IST

కోల్‌కతా: కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమైన విషయం తెలిసిందే. వైరస్‌ కట్టడి క్రమంలో బూస్టర్‌ డోసుపై కూడా అవి దృష్టి సారించాయి. భారత్‌ సైతం ఈ విషయమై రెండు వారాల్లో సమగ్ర విధానాన్ని వెల్లడిస్తామని ఇదివరకే ప్రకటించింది. ఈ తరుణంలో త్వరలో కరోనా బూస్టర్ డోసు ట్రయల్స్‌ నిర్వహణకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సన్నద్ధమవుతోన్నట్లు.. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కోల్‌కతాలోని వివిధ వైద్య సంస్థల్లో సాధ్యాసాధ్య పరీక్షలు ప్రారంభించినట్లు శుక్రవారం వెల్లడించారు.

డీసీజీఐకు లేఖ రాశాం..

ట్రయల్స్‌లో భాగమయ్యేందుకు ఇప్పటి వరకు ఆరు ఆసుపత్రులు సుముఖత వ్యక్తం చేశాయని ఆ అధికారి చెప్పారు. ఇందులో మూడు ప్రభుత్వ వైద్యసంస్థలూ ఉన్నట్లు వెల్లడించారు. బూస్టర్‌ డోసు ట్రయల్స్‌కు ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో.. ఈ ఆరు చోట్ల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ట్రయల్స్‌ విషయమై ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు లేఖ రాశామని.. అక్కడినుంచి సానుకూల సమాధానం వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బూస్టర్ డోసుల ట్రయల్స్ కోసం వైద్యారోగ్య రంగంలోని వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ రంగంనుంచి సుమారు 600 మందిని ఎంపిక చేస్తారని ఆ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు