Published : 29/03/2021 14:10 IST

పౌరులపై కాల్పులు దారుణం: బైడెన్‌

వాషింగ్టన్‌: మయన్మార్‌లో సైనిక కాల్పుల్లో అమాయక పౌరులను బలితీసుకోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వాన్ని సైన్యం తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. 

‘మయన్మార్‌లో పౌరులపై కాల్పులు భయానకమైన చర్య. అనవసరంగా భద్రతా దళాలు వంద మందికి పైగా పౌరులను పొట్టనబెట్టుకోవడం దారుణం’ అని బైడెన్‌ వెల్లడించారు. మరోవైపు యూరోపియన్‌ యూనియన్‌ సైతం ఈ సైనిక చర్యను తప్పుబట్టింది. ఇలాంటి హింసాత్మక చర్యలను తాము ఎప్పటికీ అంగీకరించబోమని ఈయూ విదేశాంగ విధాన ప్రతినిధి జోసెఫ్‌ బోరెల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘మయన్మార్‌ సైన్యం శనివారం తమ సైనిక దినోత్సవ వేడుకలకు బదులుగా.. భయానక వాతావరణాన్ని సృష్టించి సిగ్గుపడేలా చేసింది’ అని బోరెల్‌ పేర్కొన్నారు. 

మయన్మార్‌లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన పౌరులపై భద్రతాదళాలు కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో 114 మంది పౌరులు మృతి చెందినట్లు అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ సైనిక దుశ్చర్యలను ఐరాస సహా అంతర్జాతీయ సమాజం తప్పుబట్టింది.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని