గుజరాత్‌లో భాజపాకు తిరుగులేని విజయం!

గుజరాత్‌ ఉపఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించింది. ఎనిమిది స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా అన్నింటిలోనూ భాజపా తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. కాగా కాంగ్రెస్‌ కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది.

Published : 10 Nov 2020 20:29 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ ఉపఎన్నికల్లో భాజపా చరిత్ర సృష్టించింది. ఎనిమిది స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించగా అన్నింటిలోనూ భాజపా తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. కాగా కాంగ్రెస్‌ కనీసం ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. తాజా ఘన విజయంతో రాష్ట్ర వ్యాప్త భాజపా శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ మాట్లాడుతూ.. ఉపఎన్నికల్లో భాజపా కేవలం ట్రైలర్‌ మాత్రమే చూపించిందన్నారు. రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా ఘన విజయం సాధిస్తామన్నారు. కాంగ్రెస్‌ నాయకుల అసత్య ప్రచారాల్ని గుజరాత్‌, బిహార్‌, మధ్యప్రదేశ్‌, యూపీ ప్రజలు తిరస్కరించారన్నారు. దేశవ్యాప్తంగా భాజపా చరిత్రాత్మక విజయాలు సాధిస్తోందని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పనితీరుకు ఈ ఫలితాలే నిదర్శనమని రూపానీ పేర్కొన్నారు. ముస్లింలు, ఆదీవాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సైతం తామే గెలిచామని రూపానీ సంతోషం వ్యక్తం చేశారు. 

గుజరాత్‌లోని 8 నియోజకవర్గా్లో నవంబర్‌ 3న ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అబ్డాసా, కర్జన్‌, మోర్బి, గదాడ, ధారి, లిబ్డి, కప్రడ, డంగ్‌ నియోజవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 8 నియోజకవర్గా్ల్లో మొత్తం 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కచ్‌ జిల్లాలోని అబ్డాసా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరిన ప్రద్యుమ్నసిన్హ జడేజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి శాంతిలాల్‌ సెంగానిపై సిన్హ దాదాపు 36వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని