crime: ప్రేయసిని ప్రేమికుడు కాపాడాలి..
తనను నమ్మి వచ్చిన ప్రియురాలి గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రియుడిదేనని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలి ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. గత ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్‌లోని కౌషంబి జిల్లాకు చెందిన
లఖ్‌నవూ: తనను నమ్మి వచ్చిన ప్రియురాలి గౌరవ మర్యాదలను కాపాడాల్సిన బాధ్యత ప్రియుడిదేనని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. సామూహిక అత్యాచారం కేసులో బాధితురాలి ప్రియుడు వేసిన బెయిల్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. గత ఫిబ్రవరి 19న ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాకు చెందిన 15ఏళ్ల బాధితురాలు.. కుట్టుమిషన్ నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్కు వెళ్లి.. అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు చేరుకొని తన ప్రియుడు రాజును కలుసుకుంది. కొంత సమయానికి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి రాజుని బంధించి.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరుసటి రోజు బాధితురాలు అకిల్‌సారాయ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రాజుతోసహా నలుగురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా.. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం ‘‘ప్రియురాలిని కాపాడాల్సిన బాధ్యత ప్రియుడికి ఉంది. కానీ, తన ముందే ప్రియురాలిపై అత్యాచారానికి పాల్పడుతుంటే ఏ మాత్రం కాపాడే ప్రయత్నం చేయకుండా నిందితుడు ప్రేక్షక పాత్ర వహించాడు. అతడి వ్యవహారశైలి సందేహాత్మకంగా ఉంది. అలాగే.. మిగతా నిందితులతో అతడికి సంబంధాలు ఉన్నాయా.. లేదా అని ఖచ్చితంగా చెప్పలేం’’అని హైకోర్టు తెలిపింది. నిందితుడు రాజుకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసు విచారణలో భాగంగానే అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక మేజర్ అమ్మాయితో పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే అది నేరం కాదని తెలిపింది. అయితే, ఈ చర్యను భారతీయ సమాజంలో అనైతిక చర్యగా పరిగణిస్తారని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్