India to Canada: కెనడాకు వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మార్గదర్శకాలివే..

కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారత్‌ నుంచి వెళ్లే విమానాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను కెనడా ఎత్తివేసింది

Published : 27 Sep 2021 01:40 IST

దిల్లీ: కొవిడ్ -19 మహమ్మారి కారణంగా భారత్‌ నుంచి వెళ్లే విమానాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను కెనడా ఎత్తివేసింది. సెప్టెంబర్ 27 నుంచి అన్ని విమానాలు పునః ప్రారంభమవుతాయని ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని ఫెడరల్ ప్రభుత్వం తెలిపింది. భారతదేశం నుంచి వచ్చే అన్ని ప్రత్యక్ష వాణిజ్య, ప్రైవేట్ పాసింజర్ విమానాలపై సెప్టెంబర్ 26 వరకూ ప్రయాణ ఆంక్షలను గతంలో విధించింది. అయితే, ఈ కాల పరిమితి ముగియడంతో భారత్‌ నుంచి కెనడాకు వెళ్లే ప్రయాణికులకు మార్గం సుగమమైంది. కానీ, ప్రయాణికులు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని షరతు విధించింది.

కెనడాకు వెళ్లాలనుకునే వారి కోసం..

కెనడాకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు ముందుగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌పోర్ట్ కనెక్ట్ బిల్డింగ్ (ACB) లోని మెట్రో స్టేషన్ పైన ఉన్న జెన్‌స్ట్రింగ్స్ లేబొరేటరీలో చేయించుకున్న కొవిడ్ -19 పరీక్షలో నెగిటివ్‌గా తేలాలి.

ప్రయాణానికి 18 గంటల కంటే ముందుగా కరోనా పరీక్ష చేసుకోవాలి. క్యూర్‌ కోడ్‌తో ఉన్న రిపోర్టును బోర్డింగ్‌కు ముందు విమాన సిబ్బందికి అందించాలి.

ఇంతకు ముందు కరోనా బారిన పడ్డ ప్రయాణికులు కెనడాకు వెళ్లే ముందు 14 నుంచి 180 రోజుల మధ్యలో సర్టిఫైడ్‌ లేబొరేటరీ నుంచి కరోనా పరీక్ష చేయించుకోవాలి.

భారతదేశం నుంచి కెనడాకు పరోక్ష మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఎక్కడైతే విమానం దిగుతారో అక్కడే కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగిటివ్‌ తేలితేనే కెనడాకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని