దేశ రక్షణ కోసం ఇతరులపై ఆధారపడబోము

దేశ రక్షణ కోసం భారత్‌ ఎప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడబోదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ అన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా రక్షణ రంగ తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు దేశం

Updated : 02 Feb 2021 16:48 IST

బెంగళూరులో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

బెంగళూరు: దేశరక్షణ కోసం భారత్‌ ఎప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడబోదని కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ పేర్కొన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా రక్షణ రంగ తయారీ సామర్థ్యాలను పెంచుకునేందుకు దేశం నిరంతరం కృషిచేస్తోందని తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హాల్‌)లో ఎల్‌సీఏ తేజస్‌ నూతన ఉత్పత్తి లైన్‌ను రాజ్‌నాథ్‌ నేడు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా రక్షణమంత్రి మాట్లాడుతూ.. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్‌.. అనేక అంశాల్లో విదేశీ యుద్ధవిమానాల కంటే మెరుగైందని కొనియాడారు. అంతేగాక, చౌకగానూ లభిస్తోందన్నారు. ఇప్పుడు చాలా దేశాలు తేజస్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయని తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ కింద దేశ రక్షణ సామర్థ్యాలను మెరుగుపర్చుకునే దిశగా భారత్‌ చర్యలు చేపట్టిందని, ఇకపై రక్షణ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడబోమన్నారు. 

భారత వాయుసేనకు తేజస్‌ విమానాలను అందించేందుకు హాల్‌తో రూ. 48వేల కోట్ల ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. 2024 మార్చి నుంచి ఈ విమానాల సరఫరా ప్రారంభం కానుందని హాల్‌ ఛైర్మన్‌ ఆర్‌. మాధవన్‌ ఇటీవల తెలిపారు. ఏటా 16 చొప్పున మొత్తం 83 తేజస్‌లను వాయుసేకు అందించనున్నట్లు వెల్లడించారు. 

ఇవీ చదవండి..

మరోసారి పాక్‌ గుట్టు రట్టయ్యింది..!

డ్రాగన్‌ బుసలపై పెద్దన్న గుస్సా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని