Govt Of India: భద్రతా ఏజెన్సీల చీఫ్‌ పదవీకాలం పొడిగింపు

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం రెండు వేర్వేరు ఆర్డినెన్సులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జాతీయ భద్రత ఏజెన్సీల విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని

Published : 16 Nov 2021 01:21 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం రెండు వేర్వేరు ఆర్డినెన్సులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా జాతీయ భద్రత ఏజెన్సీల విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ సెక్రటరీలు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) సెక్రటరీల పదవీకాలాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా పదవుల్లో ఉన్నవారు కేవలం రెండేళ్లు మాత్రమే విధులు నిర్వర్తించాలనే నిబంధనలో కేంద్రం సోమవారం సవరణలు చేసింది. అవసరమైతే మొత్తం ఐదేళ్లు పెంచుకునే వెసులుబాటును కల్పించింది. ఈ మేరకు కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

కాగా.. గతంలోనే ఐబీ చీఫ్‌ అరవింద్‌ కుమార్‌, ‘రా’ సెక్రటరీ సమంత్‌ గోయల్‌ పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించారు. అలాగే కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్‌ కుమార్‌ భల్లా పదవీకాలం ఈ ఏడాది ఆగస్టులోనే పూర్తయినా.. మరో ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని