Petrol - Diesel : పెట్రోధరలా.. మా వద్దే తక్కువ : బాఘేల్‌

పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  తమ రాష్ట్రంలో  తక్కువగానే ఉంటాయని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ అన్నారు........

Updated : 18 Nov 2021 16:36 IST

రాయ్‌పూర్‌: పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  తమ రాష్ట్రంలో  తక్కువగానే ఉంటాయని ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బాఘేల్‌ అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రితో జరిగిన వర్చువల్ సమావేశంలో 2014 ఎన్నికల కన్నా ముందున్న ధరలకు తగ్గించాలని, సెస్‌కు స్వస్తిపలకాలని ప్రతిపాదించినప్పటికీ తాను చెప్పింది పట్టించుకోలేదని విమర్శించారు. ఇదే విషయాన్ని నవంబర్‌ 22న జరగబోయే రాష్ట్ర  కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. మరోవైపు, దీపావళికి ముందు రోజు కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై ₹10లు, డీజిల్‌పై ₹5ల చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించగా.. భాజపా పాలిత రాష్ట్రాలన్నీ వ్యాట్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన పంజాబ్‌, రాజస్థాన్‌ తగ్గించినప్పటికీ.. ఛత్తీస్‌గఢ్‌ మాత్రం ఇంకా వ్యాట్‌ తగ్గించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గురువారం రాయ్‌పూర్‌లో లీటరు పెట్రోల్‌ ధర ₹ 101.88గా ఉండగా.. డీజిల్‌ ధర ₹93.78గా ఉన్నాయి. 

మరోవైపు, ఇంధన ధరలపై వ్యాట్‌ తగ్గించే అంశంపై  కేబినెట్‌ సమావేశంలో సీఎం భూపేశ్ బాఘేల్‌ నిర్ణయం తీసుకుంటారని ఛత్తీస్‌గఢ్‌ ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్‌ సింగ్‌ దేవ్‌ తెలిపారు. ఈ నెల 22న కేబినెట్‌ సమావేశం ఉందన్నారు. ఇప్పటికే తాము సీఎంకు ప్రతిపాదనలు పంపామనీ.. ఈ నెల 22న సీఎం దీనిపై ప్రకటిస్తారన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేంత వరకు పాఠశాలలు ప్రారంభించబోమని తేల్చి చెప్పారు. పాఠశాలల సిబ్బందికి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని