India-China: సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం!

భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాసం లోపించిందని కొన్ని రోజుల కిందట డిఫెన్స్ స్టాఫ్‌ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై డ్రాగన్‌ దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అకారణంగా చైనాను నిందిస్తున్నారని, ఈ వ్యాఖ్యలు

Published : 26 Nov 2021 22:11 IST

బీజింగ్‌: భారత్‌కు చైనా అతిపెద్ద భద్రతా ముప్పుగా మారిందని, ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాద పరిష్కారం విషయంలో విశ్వాసం లోపించిందని కొన్ని రోజుల కిందట డిఫెన్స్ స్టాఫ్‌ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై డ్రాగన్‌ దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అకారణంగా చైనాను నిందిస్తున్నారని, ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని చైనా రక్షణ శాఖ ఆరోపించింది. ‘ఇరు దేశాలు ఒకదానికొకటి ముప్పుగా మారకూడదు. ఇలాంటి వ్యాఖ్యలతో ఘర్షణను ప్రేరేపించడం బాధ్యతారాహిత్యం, ప్రమాదకరం’’అని చైనా రక్షణ శాఖ ప్రతినిధి సీనియర్‌ కల్నల్‌ వూ క్వియాన్‌ అన్నారు. బిపిన్‌ వ్యాఖ్యలపై తమ అభ్యంతరాన్ని ఇప్పటికే భారత ప్రతినిధులకు తెలియజేసినట్లు చెప్పారు.

‘‘చైనా-భారత సరిహద్దు సమస్యపై చైనాకు స్పష్టమైన వైఖరి ఉంది. చైనా సరిహద్దు భద్రతాదళాలు జాతీయ సార్వభౌమాధికారాన్ని, భద్రతను పరిరక్షిస్తున్నాయి. అలాగే, సరిహద్దు ప్రాంతంలో ప్రశాంత వాతావరణం కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాయి. ఘర్షణ పరిస్థితిని తగ్గించడం కోసం గొప్ప ప్రయత్నాలు చేస్తున్నాయి’’అని సీనియర్‌ కల్నల్‌ వూ క్వియాన్‌ తెలిపారు.

గతేడాది తూర్పు లద్దాఖ్‌లో గల్వాన్‌ ఘటన అనంతరం భారత్‌-చైనా సరిహద్దుల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో రెండు దేశాలు సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు భారీ సంఖ్యలో సైనికులను మోహరించాయి. ఈ వివాదం పరిష్కారానికి ఇరు దేశాలకు చెందిన సైనికాధికారులు పలుమార్లు సమావేశమైనా చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి.

Read latest National - International News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని