Congress: వారి పదవీకాలం పొడిగింపుపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్‌!

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే, కేంద్ర హోంశాఖ,

Published : 18 Nov 2021 20:45 IST

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధిపతుల పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా.. ఆర్డినెన్సులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే, కేంద్ర హోంశాఖ, రక్షణ శాఖ సెక్రటరీలు, ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌, రీసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌(రా) సెక్రటరీ పదవీకాలాన్ని పొడిగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను కూడా రణ్‌దీప్‌ సవాల్‌ చేశారు.

ప్రజాప్రయోజనం అని పేర్కొన్నారే తప్ప.. అధికారుల పదవీకాలం పొడిగింపునకు సరైన ప్రమాణాలు వెల్లడించలేదని రణ్‌దీప్‌ అన్నారు. ఈ నిర్ణయం దర్యాప్తు సంస్థల స్వతంత్రతను ప్రశ్నార్థకంగా మారుస్తోందని, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమని పిటిషన్‌లో పేర్కొన్నారు. భద్రతా ఏజెన్సీల చీఫ్ పదవీకాలం పొడిగింపు నిర్ణయం వల్ల ఈ వ్యవస్థలు పాలకుల నియంత్రణలోకి వెళ్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఆ వ్యవస్థల పనితీరుకు విరుద్ధంగా ఉందని తెలిపారు. వీటిపై వెంటనే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రణ్‌దీప్‌ కోర్టును కోరారు. 

సీబీఐ, ఈడీ అధిపతుల పదవీకాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఆదివారం రెండు వేర్వేరు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది. వాటిపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకాలు చేశారు. ప్రస్తుతం ఆయా వ్యవస్థల అధిపతుల పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉండగా.. మరో మూడేళ్లు ఏడాది చొప్పున పొడిగించుకునే అవకాశం కల్పించారు. ఆ తర్వాత హోంశాఖ, రక్షణ శాఖ, రా సెక్రటరీలు, ఐబీ డైరెక్టర్‌ పదవీకాలాన్ని కూడా పొడిగిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిపై కాంగ్రెస్‌ నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ క్రమంలోనే రణ్‌దీప్‌ సుర్జేవాలా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని