China Floods: వెయ్యేళ్లలో చూడనంత భారీ వర్షం.. 300మందికి పైగా మృతి!

చైనాలో ఇటీవల కురిసిన వర్షాలతో భారీ ప్రాణనష్టం సంభవించింది. వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని విధంగా వచ్చిన వరదలతో మృతుల సంఖ్య 300లకు పైగా చేరిందని ......

Updated : 02 Aug 2021 20:18 IST

బీజింగ్‌: చైనాలో ఇటీవల కురిసిన వర్షాలతో భారీ ప్రాణనష్టం సంభవించింది. వెయ్యేళ్లలో ఎన్నడూ చూడని విధంగా వచ్చిన వరదలతో మృతుల సంఖ్య 300లకు పైగా చేరిందని హెనాన్‌ ప్రొవిన్షియల్‌ అధికారులు తాజాగా ప్రకటించారు. సెంట్రల్‌ చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌లో ఈ వరదల విలయానికి మొత్తంగా 302 మంది మరణించగా.. 50 మంది గల్లంతైనట్టు తెలిపారు. మృతుల్లో అత్యధికంగా ఝెంగ్‌ఝౌ ప్రొవిన్సియల్‌ కేపిటల్‌కు చెందినవారేనని పేర్కొన్నారు. ఆ ఒక్క నగరంలోనే అత్యధికంగా 292 మంది ప్రాణాలు కోల్పోగా.. 47మంది గల్లంతైనట్టు వివరించారు. మరో మూడు నగరాల్లో ఈ వర్షాలకు పది మంది మృతిచెందినట్టు మీడియాకు వెల్లడించారు. 

జులై 20న చైనాలోని హెనాన్‌ ప్రావిన్స్‌ క్యాపిటల్‌ నగరమైన ఝెన్‌ఝౌలో భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. కుండపోతగా కురిసిన వర్సానికి ఆ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వీధులన్నీ నదులను తలపించాయి. అనేక వాహనాలు, మనుషులు వరదనీటిలో కొట్టుకుపోయిన వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ వరదలతో 30 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురికాగా.. దాదాపు 3.76 లక్షల మందిని సహాయక సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఇటీవల చైనా అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా దాదాపు 10 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్టు చైనా ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు