Defence:‘రక్షణ’ ఆవిష్కరణలకు రూ.499 కోట్లు

వచ్చే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 30........

Published : 13 Jun 2021 16:29 IST

దిల్లీ: వచ్చే ఐదేళ్లకు రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ మద్దతుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఆమోదం తెలిపారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో దాదాపు 300 అంకుర సంస్థలు, సూక్ష్మ-చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), వ్యక్తిగత ఆవిష్కర్తలకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆయుధాలు, సైనిక ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ నిధులు దోహదం చేయనున్నాయని రక్షణ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ప్రొడక్షన్‌-డీడీపీ’ ఆధ్వర్యంలో ‘డిఫెన్స్‌ ఇన్నోవేషన్‌ ఆర్గనైజేషన్‌-డీఐఓ’ ఏర్పాటు చేసి దాని ద్వారా ‘ఇన్నోవేషన్‌ ఫర్‌ డిఫెన్స్‌ ఎక్స్‌లెన్స్‌-ఐడెక్స్‌’ అమలు చేయనున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ,  ఏరోస్పేస్‌ రంగంలో స్వావలంబన సాధించడమే ‘ఐడెక్స్‌-డీఐఓ’ లక్ష్యమని.. దాని కోసమే తాజాగా కేటాయిచిన రూ.499 కోట్ల  నిధులను వినియోగించనున్నట్లు తెలిపింది. ఆవిష్కర్తలు డీడీపీతో అనుసంధానమయ్యేందుకు డీఐఓ వారధిగా నిలవనుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని