దిల్లీలో వాయు కాలుష్యానికి కారణాలు అవేనా..?

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ వాయు కాలుష్యానికి.. పంజాబ్, హరియాణా సహా పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న పొగ కూడా కారణమేనని..

Published : 22 Nov 2021 02:25 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఇక్కడ వాయు కాలుష్యానికి.. పంజాబ్, హరియాణా సహా పాకిస్థాన్ నుంచి వెలువడుతున్న పొగ కూడా కారణమేనని.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా అంచనా వేసింది. నగరంలో పరిశ్రమలు, వాహన కాలుష్యానికి ఈ పొగ తోడైనట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఈ కాలుష్యం కారణంగా నగర ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో కాలుష్యం భారీస్థాయిలో నమోదవుతోందని నాసా వెల్లడించింది. దిల్లీ వాయు కాలుష్యానికి పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడే పొగ, పొరుగు రాష్ట్రాల రైతులు కాల్చే పంట వ్యర్థాలు, బాణసంచా కాల్చడం లాంటివి కారణమని తెలిపింది. విజిబుల్‌ ‘ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజింగ్‌ రేడియో మీటర్‌ సూట్‌’ ద్వారా.. ఈ నెల 11 నాటి పరిస్థితిని నాసా పరిశీలించింది. షువామీ ఎంపీపీ శాటిలైట్‌ ద్వారా ఫొటోలు తీసింది. పంజాబ్‌, హరియాణాల్లో పంట వ్యర్థాలను కాల్చడంతో భారీగా పొగ దిల్లీవైపు మళ్లి.. మరింత కాలుష్యం ఏర్పడటానికి కారణమవుతోందని నాసా పేర్కొంది. ఈ కాలుష్యంతో మనుషుల ప్రాణాలకు ముప్పు ఉన్నట్టు వెల్లడించింది. పొగ కారణంగా ఈ నెల 11న దాదాపు 2.2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నాసా మార్షల్‌ స్సేస్ ఫ్లైట్‌ సెంటర్‌ శాస్త్రవేత్త పవన్‌ గుప్తా పేర్కొన్నారు. ఈ నెల 12న దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. థార్‌ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన దుమ్ము, ధూళి, వాహన, నిర్మాణ, టపాసుల కాలుష్యం సైతం తీవ్రతకు కారణమైనట్టు వెల్లడించారు. 

దిల్లీలోని సెన్సార్లు ఈ నెలలో చాలా సందర్భాల్లో క్యూబిక్‌ మీటరుకు 400 మైక్రో గ్రాములకు మించి పీఎం 2.5, పీఎం 10 స్థాయులు నమోదు చేశాయని నాసా తెలిపింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిపారసు చేసిన క్యూబిక్‌ మీటరుకు 15 మైక్రో గ్రాముల కంటే ఎక్కువ అని వివరించింది. దిల్లీలో కాలుష్యానికి పాకిస్థాన్‌ సైతం కారణమని నాసా గుర్తించింది. ఉత్తర పాకిస్థాన్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల బారీగా వెలువడుతున్న పొగ కూడా ఈ కాలుష్యం పెరుగుదలకు కారణమని తెలిపింది.

 

Read latest National - International News and Telugu News

 

  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని