దిల్లీ బడ్జెట్: 25శాతం విద్యా రంగానికే..!
రూ.69వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన దిల్లీ ప్రభుత్వం, మొత్తం బడ్జెట్లో 25శాతం విద్యకే కేటాయించింది.
రూ.16వేల కోట్లు కేటాయించిన ఆప్ ప్రభుత్వం
దిల్లీ: విద్య, వైద్యమే ప్రధాన ఎజెండా అని ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. రూ.69వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన దిల్లీ ప్రభుత్వం, మొత్తం బడ్జెట్లో 25శాతం విద్యకే కేటాయించింది. గడిచిన ఆరు సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా బడ్జెట్లో విద్యా రంగానికి రూ.16వేల కోట్లను(25శాతం) ఖర్చు చేయనుంది. రెండో ప్రాధాన్యతగా ఆరోగ్య రంగానికి దాదాపు పదివేల కోట్లను కేటాయించింది.
2021-2022 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 69వేల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మంగళవారం ప్రవేశపెట్టారు. ఇందులో అత్యధికంగా విద్యకు రూ.16,377 కోట్లను కేటాయించగా, వైద్యరంగానికి రూ.9934 కోట్లను కేటాయించారు. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. అంతేకాకుండా మరో ప్రాధాన్యత రంగమైన ఆరోగ్య సంరక్షణకు కూడా భారీగా నిధులు కేటాయించామన్నారు. కొవిడ్ విజృంభణ వేళ, ప్రభుత్వ కేంద్రాలలో టీకా తీసుకునే వారికి ఉచితంగానే టీకా అందిస్తామని దిల్లీ ఉపముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందుకోసం దాదాపు రూ.50కోట్లను ఖర్చు చేస్తామని తెలిపారు.
ఈసారి ‘దేశభక్తి’ అనే నినాదంతో కొత్త బడ్జెట్‌ను రూపకల్పన చేశామని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. విద్యార్థుల్లో జాతీయభావాన్ని పెంపొందించడం కోసం ఈసారి కొత్త సెలబస్‌ను తీసుకొచ్చామన్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజూ ఓ గంటపాటు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాల కోసమే కేటాయిస్తామని స్పష్టంచేశారు. ‘మహిళలను గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడటం, సమానత్వం, సోదరభావం వంటి అంశాల్లో దిల్లీ పాఠశాలల పిల్లల్లో దేశభక్తిని చూడాలని అనుకుంటున్నట్లు మనీశ్ సిసోడియా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఉపాధ్యాయుల శిక్షణ కోసం ప్రత్యేకంగా ‘టీచర్స్ యూనివర్సిటీ’ని త్వరలోనే ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీచర్లు ఇక్కడ నుంచి శిక్షణ పొందవచ్చని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్‌గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్‌ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్‌వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్‌బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్‌బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్‌నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్‌ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్