delhi high court: ఏది శాకాహారమో.. మాంసాహారమో చెప్పాలి

గృహోపకరణాలు, దుస్తులు సహా ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువులపై వాటి తయారీలో వాడిన పదార్థాలను సూచించేలా

Published : 12 Nov 2021 11:54 IST

గృహోపకరణాలు, దుస్తులపై విధిగా ముద్రించాలని దావా

దిల్లీ: గృహోపకరణాలు, దుస్తులు సహా ప్రజలు ఉపయోగించే అన్ని వస్తువులపై వాటి తయారీలో వాడిన పదార్థాలను సూచించేలా విధిగా శాకాహారం లేదా మాంసాహారం అని ముద్రించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఓ సంస్థ వేసిన దావాపై దిల్లీ హైకోర్టు గురువారం కేంద్రానికి తాఖీదులు పంపింది. ప్రతి ఒక్కరికీ తాము వాడుతున్న ఉత్పత్తి గురించి తెలుసుకొనే హక్కు, తమ నమ్మకాలను అనుసరించే హక్కు ఉందని, ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలించాలని తాఖీదులు జారీ చేస్తూ.. న్యాయమూర్తి జస్టిస్‌ విపిన్‌ సంఘి నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి సూచించింది. గో సంరక్షణ కోసం పనిచేసే ‘రామ్‌ గౌ రక్షా దళ్‌’ అనే సంస్థ ఈ దావా వేసింది. ఉత్పత్తులపై ముద్రలు లేకపోవడం వల్ల శాకాహారాన్ని పాటించేవారు తమకు తెలియకుండా మాంసాహార ఉత్పత్తులు వినియోగించాల్సి వస్తోందని దావాలో పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని