Coronavirus: దిల్లీలో భారీగా తగ్గిన కేసులు

ఒకప్పుడు భారీగా నమోదయ్యే కరోనా కేసులు, మృతులతో వణికిపోయిన దేశ రాజధాని దిల్లీ నెమ్మదిగా కుదుట పడుతోంది. లాక్‌డౌన్‌, కఠిన ఆంక్షల

Published : 06 Jun 2021 21:25 IST

న్యూదిల్లీ: ఒకప్పుడు భారీగా నమోదయ్యే కరోనా కేసులు, మృతులతో వణికిపోయిన దేశ రాజధాని దిల్లీ నెమ్మదిగా కుదుట పడుతోంది. లాక్‌డౌన్‌, కఠిన ఆంక్షల అమలుతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్తగా దిల్లీలో 381 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మార్చి 15 తర్వాత అత్యల్ప కేసులు నమోదవడం ఇదే. అదే విధంగా పాజిటివిటీ రేటు కూడా 0.5శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ 34మంది మృతి చెందారు. దీంతో దిల్లీలో మొత్తం కరోనాతో చనిపోయిన వారి 24,591కి చేరింది. రాష్ట్రం కరోనా క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడిందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు.

* ఇక ఝార్ఖండ్‌లో కొత్తగా 517 పాజిటివ్‌ కేసులు నమోదవగా, కరోనాతో చికిత్స పొందుతూ 12మంది మృతి చెందారు.  దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,046కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

* ఒడిశాలో కొత్తగా 7002 కరోనా కేసులు నమోదవగా, 42 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 2,994 చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని