Delta Plus:  మళ్లీ మాస్కులు ధరించండి

ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ వైరస్‌ ఉద్ధృతి వేగవంతమవ్వడంతో బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసింది.

Updated : 25 Jun 2021 15:34 IST

ప్రజలకు ఆదేశాలిచ్చిన ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ

టెల్‌ అవీవ్‌: కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇన్‌డోర్‌ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం డెల్టా వేరియంట్‌ వైరస్‌ ఉద్ధృతి వేగవంతమవ్వడంతో బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కులు ధరించాలని ఆరోగ్యశాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఆరోగ్య శాఖాధికారి నాచ్‌మన్‌ యాష్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచం మొత్తంలో ఇజ్రాయెల్‌ వేగవంతంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను చేపడుతున్న దేశంగా నిలిచింది. అయినప్పటికీ రోజుకు వందకు పైగా డెల్టా వేరియంట్‌ కేసులు నమోదవ్వడం ఆందోళనకరంగా మారింది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగడం అందరినీ కలవరపెడుతోంది. కాబట్టి తిరిగి మాస్కులు ధరించడం ప్రారంభించాలి’’ అని వెల్లడించారు. కాగా డెల్టా కేసుల సంఖ్య పెరుగుదలకు కారణం భారత్‌లో నమోదైన తొలి డెల్టా వేరియంట్‌ కేసేనని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని