Delta Variant: అమెరికా ప్రయత్నాలకు ఇది అడ్డంకే

కరోనావైరస్‌ను పారదోలడానికి అమెరికా చేస్తోన్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ ముప్పుగా పరిణమించిందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 23 Jun 2021 14:34 IST

పారదోలే ఆయుధాలు మన చెంతే: ఫౌచీ

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ను పారదోలడానికి అమెరికా చేస్తోన్న ప్రయత్నాలకు డెల్టా వేరియంట్ ముప్పుగా పరిణమించిందని ప్రముఖ వైద్య నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మొదట వెలుగులోకి వచ్చిన కరోనా వేరియంట్‌ కంటే డెల్టా వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. అలాగే వ్యాధి తీవ్రతకు కూడా ఇది కారణమవుతోంది. అయితే, ఆ వేరియంట్‌ను అడ్డుకొనే అయుధాలు మనచెంత ఉన్నాయి. వాటిని సమర్థవంతగా ఉపయోగించుకుందాం’ అని ఫౌచీ అన్నారు. ఫైజర్, మోడెర్నా టీకాలతో సహా అమెరికాలో అందుబాటులో ఉన్న టీకాలన్ని ఈ వేరియంట్‌పై ప్రభావంతగా పనిచేస్తున్నాయని చెప్పారు. 

మరోపక్క జులై 4 నాటికి 70 శాతం మంది వయోజనులకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని చేరేందుకు.. అమెరికాకు మరికొంత  సమయం పట్టేలా ఉంది. ఈ విషయాన్ని శ్వేతసౌధ సీనియర్ సలహాదారు జెఫ్రే జీంట్స్ వెల్లడించారు. అధికారిక గణాంకాల ప్రకారం సోమవారం నాటికి.. 45 శాతం మంది ప్రజలు టీకా రెండుడోసులను పొందారు.

భారత్‌లో రెండోదశలో కరోనా ఉగ్రరూపానికి డెల్టా వేరియంటే కారణమని నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్‌ను మొదట మనదేశంలోనే గుర్తించారు. ఇప్పటికే ఇది పలుదేశాలకు వ్యాపించింది. బ్రిటన్‌లో కొత్త కేసుల పెరుగుదలకు ఇదే కారణమవుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీని విస్తృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని