mucormycosis: బ్లాక్‌ఫంగస్‌ చికిత్స ఖర్చు తగ్గించవచ్చు..!

కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారిలో కొందరు ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకర్‌మైకోసిస్‌) బారిన పడుతున్నారు. దీని చికిత్సకు భారీగా ఖర్చవుతోంది.

Updated : 07 Jun 2021 15:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొవిడ్‌ నుంచి కోలుకొన్న వారిలో కొందరు ఇటీవల బ్లాక్‌ ఫంగస్‌ (మ్యూకర్‌మైకోసిస్‌) బారిన పడుతున్నారు. దీని చికిత్సకు భారీగా ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు సర్జన్లు చికిత్సను తగ్గించడానికి ఓ కొత్త మార్గం సూచిస్తున్నారని టైమ్స్‌ఆఫ్‌ ఇండియా కథనం పేర్కొంది. ఈ మార్గంలో చికిత్స ఖర్చు రూ.35 వేల నుంచి రూ.350కు తగ్గిపోతుందని వెల్లడించింది. ప్రస్తుతం దీని చికిత్సకు లింపోసోమాల్‌ను వినియోగిస్తున్నారు. ఇది యాంపోటెరిసన్‌ అనే ఔషధం రూపం.  దీనిని బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో వినియోగిస్తారు. దీనిని లింపోసోమాల్‌ రూపంలో కాకుండా యాంపోటెరిసన్‌ రూపంలో వాడితే ధర 100 రెట్లు తగ్గిపోతుందని తెలిపారు. కాకపోతే ఈ ఔషధాన్నివినియోగించే సమయంలో శరీంలో రక్తంలో క్రియాటిన్‌ స్థాయిలను జాగ్రత్తగా పరిశీలించాలి. వీటి స్థాయిలు పెరిగిన సమయంలో జాగ్రత్తగా ఈ ఔషధాన్ని వినియోగంచాలి. 

రక్తంలో ఉండే క్రియాటిన్‌ అనే వ్యర్థం  కిందకు వస్తుంది.  దీనిని కిడ్నీ తయారు చేస్తుంది. శరీరంలో అత్యధిక మోతాదులో క్రియాటిన్‌ ఉండటం ప్రమాదకరం. డాక్టర్లు యాంపోటెరిసన్‌ వినియోగానికి అనవసరంగా సందేహించి లింపోసమాల్‌ యాంపోటెరిసన్‌ వినియోగిస్తారని ఈ కథనం పేర్కొంది. వాస్తవానికి రెండు ఒకే రకమైన ప్రభావం చూపిస్తాయి. కాకపోతే,  యాంపోటెరిసన్‌ వాడినప్పుడు క్రియాటిన్‌ నియంత్రణపై ఎక్కువ దృష్టిపెట్టాలి.  ఇప్పటికే దేశ వ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్‌ ఔషధాల కొరత తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్‌ విధానాలను పునఃసమీక్షించాలని దిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించింది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని