ట్రంప్ తానే గెలిచాననుకుంటున్నారు: లారా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తానే విజయం సాధించానని భావిస్తున్నారని ఆయన కోడలు, ప్రచార సలహాదారు లారా ట్రంప్ వెల్లడించారు. ఒకవేళ జనవరి 20 నుంచి జో బైడెన్ అధ్యక్ష పగ్గాలు చేపడితే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తానే విజయం సాధించానని భావిస్తున్నారని ఆయన కోడలు, ప్రచార సలహాదారు లారా ట్రంప్ వెల్లడించారు. ఒకవేళ జనవరి 20 నుంచి జో బైడెన్ అధ్యక్ష పగ్గాలు చేపడితే.. డొనాల్డ్ ట్రంప్ 2024 ఎన్నికల్లో తిరిగి పోటీలో ఉంటారని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. బైడెన్ గెలుపును ధ్రువీకరిస్తూ బుధవారం కాంగ్రెషనల్ ఓట్ జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
‘ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంపే విజయం సాధించారని మేం భావిస్తున్నాం. ఒకవేళ ఆయన వచ్చే నాలుగు సంవత్సరాలు పదవిలో లేకపోతే.. 2024లో తిరిగి ఎన్నికల బరిలో నిలిచే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాం’ అని లారా తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ ఇంకా తాను అధ్యక్షుడిగా గెలిచానని భావిస్తున్నారా? అని విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందిస్తూ.. ‘అవును ట్రంప్ ఎన్నికల్లో తానే గెలిచినట్లు భావిస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది ఆయనతో ఏకీభవించారు. ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. ఈ విషయాన్ని మేం చాలా సీరియస్‌గా తీసుకున్నాం. ఎందుకంటే అది కేవలం ట్రంప్‌ను తిరిగి ఎన్నుకోవడానికి సంబంధించిన విషయం కాదు. మొత్తం అమెరికా ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం కలిగించే వ్యవహారమిది’ అని లారా ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ విజయాన్ని ఇప్పటికే ఎలక్టోరల్ కాలేజీ ధ్రువీకరించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా 46వ అధ్యక్షుడిగా బైడెన్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమం అయింది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో ఆయనకు 306 ఓట్లు రాగా.. ప్రత్యర్థి ట్రంప్‌నకు 232 ఓట్లు మాత్రమే వచ్చాయి.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్