DRDO: శత్రు క్షిపణులను బోల్తా కొట్టించే సాంకేతికత ఇది

మన యుద్ధ విమానాలపై దూసుకొచ్చే ప్రత్యర్థుల ‘రాడార్‌ చోదక క్షిపణుల’ను దారి మళ్లించేలా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేసింది. ‘అడ్వాన్స్‌ చాఫ్‌ మెటీరియల్‌, చాఫ్‌ క్యాట్రిడ్జ్‌- 118/ఐ’ అనే ఈ టెక్నాలజీని స్వదేశీ...

Published : 19 Aug 2021 22:22 IST

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన డీఆర్డీవో

దిల్లీ: మన యుద్ధ విమానాలపై దూసుకొచ్చే ప్రత్యర్థుల ‘రాడార్‌ చోదక క్షిపణుల’ను దారి మళ్లించేలా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేసింది. ‘అడ్వాన్స్‌ చాఫ్‌ మెటీరియల్‌, చాఫ్‌ క్యాట్రిడ్జ్‌- 118/ఐ’ అనే ఈ టెక్నాలజీని స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీవోకు చెందిన రెండు ప్రయోగశాలల్లో రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ఈ సాంకేతికతపై నిర్వహించిన ట్రయల్స్‌ కూడా విజయవంతమయ్యాయని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఐఏఎఫ్‌లో దీన్ని ప్రవేశపెట్టే ప్రక్రియ సైతం మొదలైందని తెలిపింది. ఈ విషయమై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం డీఆర్డీవో, వాయుసేనను ప్రశంసించారు. వ్యూహాత్మక రక్షణ సాంకేతికతల అభివృద్ధిలో 'ఆత్మనిర్భర్ భారత్' దిశగా డీఆర్డీవో మరో ముందడుగు వేసిందని కొనియాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని