Drone Attack: అభా ఎయిర్‌ పోర్టుపై డ్రోన్‌ దాడి.. ఓ విమానం ధ్వంసం

నైరుతీ సౌదీ అరేబియా లక్ష్యంగా వరుసగా రెండోసారి డ్రోన్‌ దాడి జరిగింది. అబా విమానాశ్రయంపై జరిగిన డ్రోన్‌ దాడుల్లో దాడిలో ఎనిమిది మంది .......

Published : 31 Aug 2021 21:58 IST

24గంటల్లో రెండోదాడి.. ఎనిమిది మందికి గాయాలు.. 

అబా: నైరుతీ సౌదీ అరేబియా లక్ష్యంగా వరుసగా జరుగుతున్న డ్రోన్‌ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అభా విమానాశ్రయంపై జరిగిన మరో డ్రోన్‌ దాడిలో ఎనిమిది మంది గాయపడగా.. ఓ పౌర విమానం ధ్వంసమైనట్టు స్థానిక టీవీ ఛానల్‌ వెల్లడించింది. యెమెన్‌ తిరుగుబాటుదారులతో సౌదీ సేనల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అబా విమానాశ్రయంపై ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ ఏ సంస్థా ఇంతవరకు ప్రకటన చేయలేదు. గడిచిన 24గంటల వ్యవధిలోనే అభా విమానాశ్రయంపై రెండు దాడులు జరిగాయి. తొలుత జరిగిన దాడిలో ఎలాంటి నష్టం జరగనప్పటికీ.. తాజా దాడుల్లో మాత్రం ఎనిమిదిమందికి గాయాలు కావడంతో పాటు ఓ విమానం ధ్వంసమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని