Dubai: పెగాసస్‌తో ప్రిన్సెస్‌ హయా ఫోన్‌ హ్యాక్‌..!

దుబాయి పాలకుడు మాజీ భార్య ప్రిన్సెస్‌ హయా ఫోన్‌ను పెగసస్‌ ఉపయోగించి హ్యాక్‌ చేశారు. దీనికి దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌

Published : 09 Oct 2021 02:00 IST

ఇంటర్నెట్‌డెస్క్: దుబాయ్‌ పాలకుడి మాజీ భార్య ప్రిన్సెస్‌ హయా ఫోన్‌ను పెగాసస్‌ ఉపయోగించి హ్యాక్‌ చేశారు. దీనికి దుబాయ్‌ పాలకుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ ఆదేశాలే కారణమని తెలిసింది. ఈ విషయంలో లండన్‌లోని ఓ న్యాయస్థానం కూడా దర్యాప్తు బృందంతో ఏకీభవించింది.

అల్‌ మక్తూమ్‌- ఆయన మాజీ భార్య హయా బిన్ట్‌ అల్‌ హుస్సేనీ మధ్య పిల్లలను పెంచే విషయమై వివాదం ఉంది. 2019లో ఆమె మక్తూమ్‌ను వదిలేసి లండన్‌కు పారిపోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో మక్తూమ్‌ పిల్లలపై తనహక్కును సాధించుకోవడానికి హయాపై అధికారం వాడటం మొదలుపెట్టారని లండన్‌ న్యాయస్థానం జడ్జి ఆండ్రూ మెక్‌ఫ్రాలెన్‌ తెలిపారు. దుబాయ్‌ పాలకుడు ఆ ఇద్దరు పిల్లల తల్లి ఇంగ్లాండ్‌ రాక ముందు నుంచే వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొన్నారు. అతడి తరపున లండన్‌లో పనిచేస్తున్నవారు.. చట్టవ్యతిరేక చర్యల ఫలితాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

మరోపక్క మక్తూమ్‌ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు.  అసంపూర్తి చిత్రాన్ని చూసి న్యాయస్థానం ఒక అభిప్రాయానికి వచ్చిందన్నారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యాలను చూపలేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని