చనిపోయిన ఏనుగుకు కన్నీటి వీడ్కోలు..! 

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ఏనుగుకు.. అశ్రు నయనాలతో గ్రామస్థులు తుది వీడ్కోలు పలికిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

Published : 17 Nov 2021 01:24 IST

బెళగావి: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ఏనుగుకు.. అశ్రు నయనాలతో గ్రామస్థులు తుది వీడ్కోలు పలికిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెళగావి జిల్లా చిప్పలికట్టి గ్రామంలోని మహాలక్ష్మి ఆలయంలో గత కొన్నేళ్లుగా సుధ అనే 60 ఏళ్ల వయసున్న ఆడ ఏనుగు ఉంటోంది. 1975లో సుధను ఈ దేవాలయానికి తీసుకువచ్చారు. ఆలయంలో జరిగే ఎన్నో ఉత్సవాల్లో ఆ ఏనుగు పాల్గొంది. వివిధ రాష్ట్రాల్లో జరిగిన చాలా కార్యక్రమాల్లోనూ ఈ ఏనుగు పాల్గొంది. వృద్ధాప్యంతోపాటు, కాలికి గాయంతో సుధ ఇటీవల అనారోగ్యానికి గురైంది. నెల రోజులుగా చికిత్స పొందుతున్నా ఆరోగ్యం కుదుటపడలేదు.  పరిస్థితి విషమించడంతో సోమవారం కన్నుమూసింది. సుధ మరణవార్త విని గ్రామస్థులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. చిప్పలికట్టి సమీప గ్రామాల ప్రజలు సైతం కడసారి ఆ ఏనుగును చూసేందుకు తరలి వచ్చారు. రామదుర్గ ఎమ్మెల్యే మహాదేవప్ప, బెళగావి జిల్లా కలెక్టర్‌ సహా ఇతర అధికారులు కూడా వచ్చి ఏనుగుకు తుది వీడ్కోలు పలికారు.    


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని