తెలంగాణకు అదనంగా నిధులు

మూలధన వ్యయానికి కేంద్రం తెలంగాణకు అదనంగా నిధులు కేటాయించింది.

Published : 30 Jan 2021 13:33 IST


 

దిల్లీ: మూలధన వ్యయానికి కేంద్రం తెలంగాణకు అదనంగా నిధులు కేటాయించింది. రూ.179 కోట్లు కేటాయిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. తొలి వాయిదా కింద రూ.89.50 కోట్లు విడుదల చేసింది. కేంద్రం నిర్దేశించిన సంస్కరణలను తెలంగాణ పూర్తి చేసినందుకుగానూ ప్రోత్సాహకంగా అదనపు నిధులను కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తం నాలుగు సంస్కరణలను కేంద్రం ప్రతిపాదించగా.. మూడింటిని పూర్తి చేసి దేశంలో రెండో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్‌ ఉంది. తెలంగాణ రాష్ట్రం వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌ కార్డు, సులభతర వాణిజ్యం, పట్టణాభివృద్ధిలో సంస్కరణలను అమలు చేసింది.

ఇవీ చదవండి
పాముకు చెలగాటం.. పక్షులకు ప్రాణసంకటం
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి:ఎస్‌ఈసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని