Published : 25/09/2020 14:11 IST

రెండు నోబెల్‌ నామినేషన్లా.. మంచిదే: ట్రంప్‌

పురస్కారం కోసం భారత్‌, చైనాల మధ్య రాయబార యత్నం

న్యూయార్క్: అత్యున్నత నోబెల్‌ పురస్కారాన్ని దక్కించుకోవాలనే కోరికతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్‌, చైనాల మధ్య రాయబారం నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అరబ్‌ దేశాలు, ఇజ్రాయల్‌ మధ్య సత్సంబంధాల స్థాపన యత్నానికి గాను ఆయన పేరు ఇటీవల నోబెల్‌ బహుమతికి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ తైబ్రింగ్‌ జెడ్డే ట్రంప్‌ను నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ చేశారు.

కాగా  ఈ విషయంపై  మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘ప్రస్తుతం చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆ దేశాల మధ్య ఎక్కువగా విభేదాలు చోటుచేసుకున్నట్టు నేను గమనించాను. వాటిని ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాను. అయితే ఈ విషయంలో మేము ఏదైనా సహాయం చేయగలిగితే.. సంతోషంగా చేస్తాము. రెండు నోబెల్‌ బహుమతులకు నామినేట్‌ కావటం గొప్ప గౌరవమే కదా! అయితే ఏం జరుగుతుందో వేచి చూద్దాం..’’ అని జవాబిచ్చారు.

అమెరికా అధ్యక్షుడు గతంలో కూడా కశ్మీర్‌ వ్యవహారంలో తాను మధ్యవర్తిత్వం నిర్వహిస్తానంటూ పలుమార్లు ముందుకొచ్చారు. కాగా, ఆయన ప్రతిపాదనను భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇదిలా ఉండగా అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్‌ ఒబామాకు నోబెల్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ అక్కసుతో ట్రంప్‌.. ఒబామా గౌరవాన్ని తగ్గించే పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాను నోబెల్‌ బహుమతికి నామినేట్‌ కావటాన్ని ఆయన చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. అయితే నోబెల్‌ అకాడమీకి ఆయనతో పాటు కొన్ని డజన్ల నామినేషన్లు వచ్చాయనే సంగతిని ఆయన విస్మరిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని