Published : 25/02/2021 09:36 IST

డాలరు చదువు.. ఇక రూపాయల్లో! 

స్వదేశంలో ఉంటూనే విదేశీ కోర్సులను అభ్యసించే వీలు 

దిల్లీ: విదేశీ డిగ్రీ పట్టాలు సాధించాలంటే భారతీయ విద్యార్థులు ఇకపై ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు! స్వదేశంలో ఉంటూనే.. విదేశీ విద్యా సంస్థల్లోని డిగ్రీ కోర్సులను ఎంచక్కా చదివేయొచ్చు!! ఇందుకోసం విదేశీ, భారత విద్యా సంస్థలు పరస్పరం కలిసి పనిచేసేలా విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ప్రత్యేక ముసాయిదాను సిద్ధం చేసింది. అందులోని నిబంధనలపై వచ్చే నెల చివరి కల్లా అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించనుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సదరు నిబంధనలను అధికారికంగా జారీ చేసే అవకాశముంది. 

నూతన విధానంలో భాగంగా.. భారతీయ విద్యా సంస్థలు యూజీసీ అనుమతి తీసుకొని విదేశీ ఇన్‌స్టిట్యూట్లతో జత కడతాయి. అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకొని.. విదేశీ కోర్సులను మన దేశంలోనే అందిస్తాయి. ఆయా కోర్సులను అభ్యసించే విద్యార్థులకు చెందిన 30-50% మార్కులు భారతీయ విద్యాసంస్థల చేతుల్లో, 50-70% మార్కులు విదేశీ ఇన్‌స్టిట్యూట్ల పరిధిలో ఉంటాయి. ‘జాతీయ మదింపు, గుర్తింపు మండలి (న్యాక్‌)’ ర్యాంకింగ్‌లో నాలుగు పాయింట్లకుగాను 3.01, అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన భారతీయ విద్యాసంస్థలు, ర్యాంకింగ్‌లో టాప్‌-100లో నిలిచే విద్యాసంస్థలకు అనుమతుల విషయంలో పలు సడలింపులు ఇవ్వనున్నారు. 

ఆ రెండు సమస్యలకు చెక్‌! 
విదేశీ విద్యా సంస్థల్లో చదువుకునేందుకు ఏటా భారీ సంఖ్యలో భారతీయ విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్తుంటారు. 2019లో మన దేశం నుంచి ఇలా 7.5 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్థులు అధిక సంఖ్యలో వెళ్తుండటంతో భారత కరెన్సీ కూడా భారీగా ఇతర దేశాలకు తరలివెళ్తోంది. విదేశాలకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకుండా, ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడుతుండటాన్ని ‘మేధో వలస’గా పలువురు విశ్లేషిస్తున్నారు. యూజీసీ తాజాగా రూపొందించిన ముసాయిదా విధానం ఈ సమస్యలకు తెరదించుతుందని అంచనాలున్నాయి. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని