Viral video: ఆ ఏనుగు పేరు పునీత్‌ రాజ్‌కుమార్‌..

అమ్మను విడిచిపెట్టేందుకు చిన్నారులు ఎలా ఏడుస్తారో.. ఆ పిల్ల ఏనుగు అలాగే కంటతడి పెట్టింది. తల్లి ఏనుగు నుంచి విడదీసే యత్నాలను తీవ్రంగా ప్రతిఘటించింది. తప్పని సరి పరిస్థితుల్లో విడదీస్తున్న అటవీ సిబ్బందిని చూసి ఘీంకరించింది. కానీ, శిక్షణలో భాగంగా ఏడు ఏనుగులతో వల పన్ని ఆ పిల్ల ఏనుగును తల్లి నుంచి ....

Published : 12 Nov 2021 23:50 IST

శివమొగ్గ: అమ్మను విడిచిపెట్టేందుకు చిన్నారులు ఎలా ఏడుస్తారో.. ఆ పిల్ల ఏనుగు అలాగే కంటతడి పెట్టింది. తల్లి ఏనుగు నుంచి విడదీసే యత్నాలను తీవ్రంగా ప్రతిఘటించింది. తప్పని సరి పరిస్థితుల్లో విడదీస్తోన్న అటవీ సిబ్బందిని చూసి ఘీంకరించింది. కానీ, శిక్షణలో భాగంగా ఏడు ఏనుగులతో వల పన్ని ఆ పిల్ల ఏనుగును తల్లి నుంచి వేరు చేశారు. తల్లిలేని కొత్త ప్రపంచాన్ని పిల్ల ఏనుగుకు పరిచయం చేసేందుకు అటవీ సిబ్బంది చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది.

శిక్షణ ఇచ్చేందుకే ఈ రెండింటినీ విడదీసినా.. తల్లిని వీడలేక ఆ చిన్న ఏనుగు చేసిన పోరాటం అందరి హృదయాలను కదిలించింది. తల్లిని వీడుతూ ఆ గున్న ఏనుగు పెట్టిన కంటతడి అందరి మనస్సును బరువెక్కించింది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఓ ఏనుగును తల్లి నుంచి అటవీశాఖ సిబ్బంది వేరు చేశారు. పిల్ల ఏనుగుకు శిక్షణ ఇచ్చేందుకే ఇలా చేసినట్లు అటవీసిబ్బంది తెలిపారు. తాళ్లతో బంధించి బలవంతంగా ఆ రెండు ఏనుగుల్ని వేరు చేశారు. ఈ పిల్ల గున్న ఏనుగుకు ఈరోజే పునీత్‌ రాజ్‌కుమార్‌ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని