Taliban: ఐటీ మాజీ మంత్రి.. ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్‌

ఆయన ఒకప్పుడు అఫ్గానిస్థాన్‌ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. కట్‌చేస్తే.. ఇప్పుడు జర్మనీలోని లీప్‌జిగ్‌ నగర వీధుల్లో పిజ్జా డెలివరీ

Updated : 25 Aug 2021 22:22 IST

బెర్లిన్‌: ఆయన ఒకప్పుడు అఫ్గానిస్థాన్‌ ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. కట్‌చేస్తే.. ఇప్పుడు జర్మనీలోని లీప్‌జిగ్‌ నగర వీధుల్లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నారు. జీవితం ఇంతలా తల్లకిందులవ్వడానికి కారణమేమిటి అనే విషయానికే వస్తే.. ఆయన పేరు సయ్యద్ అహ్మద్ షా సాదత్. 2018 వరకు అఫ్గానిస్థాన్‌ ఐటీశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించారు. తాలిబన్ల అజెండాకి భయపడటంతో పాటు ఆపై అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో విబేధాలు తలెత్తడంతో ఆ పదవికి రాజీనామా చేసి జర్మనీకి వెళ్లారాయన. ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. చేతిలో నయా పైసా లేదు. ఆర్థిక సమస్యలతో పాటు కష్టాలు ఒక్కొక్కటీ మెల్లగా తలుపుతట్టడం ప్రారంభమైంది. దీంతో పిజ్జా డెలివరీ చేసే పనిని ఎంచుకున్నాడు. ‘‘ప్రస్తుతం నేను జర్మనీలో లీప్ జిగ్‌లో నా కుటుంబంతో సంతోషంగా, సురక్షితంగా ఉన్నా. చాలా సింపుల్‌గా బతుకుతున్నా. పిజ్జా అమ్మకాలు చేయగా వచ్చిన డబ్బును ఏమాత్రం వృథా చేయడంలేదు. దాచుకుంటున్నా. ఇక్కడే జర్మనీ కోర్స్‌ చేస్తూ చదువుకోవాలనుకుంటున్నా. అంతేకాదు.. చాలా ఉద్యోగాలకు దరఖాస్తు చేశా. కానీ.. దేనికి స్పందన రాలేదు. నా కోరిక మాత్రం ఒక్కటే. ఎలాగైనా టెలికాం కంపెనీలో పనిచేయాలని. దాన్ని నేరవేర్చుకుంటా’’అని తెలిపారు.

తారుమారైన జీవితం

చేసే పనికి చదువుకున్న చదువుకి ఏమాత్రం సంబంధం ఉండదంటారు. సయ్యద్‌ జీవితంలో ఇది అక్షరాల నిజం. ఎందుకంటే... ఆయన  ప్రపంచ ప్రఖ్యాతవిశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీతో పాటు కమ్యూనినికేషన్‌ డిగ్రీ పొందారు. 13 దేశాల్లో.. కమ్యూనికేషన్‌ విభాగంలో 23ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఆయనది. కానీ, పరిస్థితుల దృష్ట్యా జీవితం ఇలా తారుమారైంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని