Huawei: మూడేళ్ల తర్వాత చైనాకు చేరిన హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాన్‌ఝూ!

హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాన్‌ఝూ మూడేళ్లపాటు కెనాడ హౌస్‌ అరెస్ట్‌ నుంచి విడుదలై శనివారం రాత్రి చైనాకు చేరుకొన్నారు.

Updated : 27 Sep 2021 17:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మూడేళ్లపాటు కెనడాలో హౌస్‌ అరెస్ట్‌ అయిన హువావే సీఎఫ్‌వో మెంగ్‌ వాన్‌ఝూ శనివారం రాత్రి చైనాకు చేరుకొన్నారు. ఆమెను అమెరికా అప్పగించే విషయమై జరుగుతున్న న్యాయపోరాటం ముగియటంతో ఇంటికి తిరిగి వచ్చారు. ఇది తన విజయంగా చైనా భావిస్తోంది. 

2018 డిసెంబర్‌ మెంగ్‌ అరెస్టుతో చైనా-అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఆంక్షలను ఆమె ఉల్లంఘించి అమెరికా టెక్నాలజీని అందజేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె అరెస్టుకు ట్రంప్‌ రాజకీయ ఉద్దేశాలే కారణమని చైనా ఆరోపించింది. అంతేకాదు, చైనా- అమెరికా, కెనడాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కెనడాకు చెందిన మిషెల్‌ కోవ్రిగ్‌, మిషెల్‌ స్పావొర్‌లను చైనా అరెస్టు చేసింది. మెంగ్‌ విడుదలైన కొద్ది గంటల్లోనే వీరు కూడా విడుదలయ్యారు. శనివారం సాయంత్ర మెంగ్‌ షెన్‌జెన్‌లోని హువావే హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకొన్నారు. మిషెల్‌ స్పవొర్‌ ఉత్తరకొరియాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. ఇక కోవ్రిగ్‌ మాజీ దౌత్యవేత్త. 

మెంగ్‌ కోసం చైనా ప్రభుత్వం ప్రత్యేకంగా ఛార్టర్డ్‌ విమానాన్ని ఏర్పాటు చేసింది. షెన్‌జెన్‌లో విమానంలోకి దిగే సమయంలో కింద భారీ సంఖ్యలో ప్రజలు ఉన్నారు. ఈ సందర్భంగా మెంగ్‌ మాట్లాడుతూ ఎట్టకేలకు దేశానికి తిరిగి వచ్చానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైనా కమ్యూనిస్టు పార్టీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని