₹3 వేల కోట్లు దాటిన రామమందిరం విరాళాలు

అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్లు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు....

Published : 17 Mar 2021 22:56 IST

లఖ్‌నవూ: అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం సేకరిస్తున్న విరాళాలు రూ.3 వేల కోట్లు దాటాయి. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆడిట్ జరుగుతోందని ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు.ఆలయ నిర్మాణం కోసం ఇంటింటికి వెళ్లి విరాళాలు సేకరించడం నిలిపివేశామని, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ ద్వారా భక్తులు విరాళాలు పంపవచ్చని ఆయన స్పష్టం చేశారు. 

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు. నిధులు సేకరిస్తూనే ఆలయ ప్రాముఖ్యత, అయోధ్య ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. నిధుల సేకరణకు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. అనేక మంది దాతలు భారీగా విరాళాలు సమర్పించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని