త్వరలో గగన్‌యాన్ మొదటి దశ ప్రయోగం..!
మానవులను అంతరిక్షంలోకి పంపే పరిశోధనల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మానవ సహిత గగన్‌యాన్’ ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ(ఇస్రో) సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ విధించడంతో
బెంగళూరు: మానవులను అంతరిక్షంలోకి పంపే పరిశోధనల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘మానవ సహిత గగన్‌యాన్’ ప్రయోగానికి భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ (ఇస్రో) సిద్ధమవుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ విధించడంతో కొంచెం ఆలస్యమయ్యింది. బెంగళూరులో లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, డిసెంబరులో ప్రయోగం చేపట్టడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. 2018లోనే ఈ మిషన్ గురించి ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ‘ఇప్పటి వరకు అంతా సవ్యంగానే సాగింది. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తేసిన తర్వాత తుది దశ ప్రయోగానికి ముందు శాస్ర్తవేత్తలంతా సమావేశమై పరిస్థితులను అంచనా వేయనున్నారు’ అని ఇస్రోవర్గాలు తెలిపాయి.
‘గగన్‌యాన్ మిషన్’ అనేది మూడు దశల ప్రయోగం. మొదటి రెండు దశల్లో మానవ రహిత మాడ్యూళ్లను అంతరిక్షంలోకి పంపుతారు. అనంతరం, మూడో దశలో రష్యాలో శిక్షణ పొందిన వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతారు. మొదటి దశ ప్రయోగాలను ఈ ఏడాది డిసెంబరులో, రెండో దశ ప్రయోగాలను 2022-23లో చేపట్టనున్నారు. ఆ రెండు ప్రయోగాలు విజయవంతమైతే చివరగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం ప్రయోగించాల్సిన పలు మిషన్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. సూర్యుడిపై పరిశోధనల కోసం ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్1’ మిషన్, మరో మూడు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, రెండు స్మాల్ శాటిలైట్ లాంఛ్ వెహికిల్స్ (ఎస్ఎస్ఎల్వీ) ప్రయోగాలు వాయిదా పడ్డాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
న్యూమోనియాతో బాధ పడుతూ, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్న ఓ వృద్ధురాలు.. అంబులెన్సులో వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
భాజపా నేత రవికిషన్ (Ravi Kishan) తన తండ్రి అంటూ ఓ యువతి కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంలో ఆయనకు స్వల్పఊరట లభించింది. -
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
PM Modi: వీవీ ప్యాట్ స్లిప్‌ల లెక్కింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజాస్వామ్యానికి విజయం దక్కినట్లయ్యిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని విమర్శించారు. -
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
ఎన్నికల్లో నోటా (NOTA)కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఎన్నికల సంఘానికి (Election Commission) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్‌ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్‌కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్‌ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్‌ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్‌లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్‌తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?