వ్యోమగామికి భూమినుంచే చికిత్స

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అంతరిక్షంలోని వ్యోమగామికి భూమి మీదనున్న వైద్యుడు చికిత్స అందించారు.

Published : 04 Jan 2020 17:45 IST

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా అంతరిక్షంలోని వ్యోమగామికి భూమి మీదనున్న వైద్యుడు చికిత్స అందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్‌) ఉండే ఒక వ్యోమగామికి మెడ నరంలో రక్తం గడ్డకట్టింది. గురుత్వాకర్షణ శూన్యమైన అంతరిక్షంలో ఈ విధమైన సమస్య తలెత్తటం ఇదే మొదటి సారి. దీనికి ఎలా చికిత్స చేయాలో అనే విషయంలో నాసా ఈ అంశంలో నిపుణుడైన ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ మోల్‌ను సంప్రదించింది.

‘‘పేషెంటును చూడటానికి నేను ఐఎస్‌ఎస్‌కు వెళ్లవచ్చా అని అడిగాను. ఇప్పట్లో అది సాధ్యం కాదని నాసా చెప్పింది. దాంతో నేను ఇక్కడి నుంచే ట్రీట్‌మెంట్‌ మొదలు పెట్టాను.’’ అని మోల్‌ నవ్వుతూ వివరించారు. ఈ చికిత్స 90 రోజుల పాటు సాగింది. దీనిలో భాగంగా అ వ్యోమగామి తనకు తానే అల్ట్రాసౌండ్‌ పరీక్షలను చేసుకున్నాడు. భూమినుంచి మోల్‌ ఆ వ్యోమగామికి ఇ-మెయిల్‌, ఫోన్‌ కాల్స్‌ ద్వారా సలహాలు, సూచనలు అందించారు. దీనితో భూమి మీదకు వచ్చే లోగానే ఆ వ్యోమగామి ఆరోగ్య సమస్య చక్కగా కుదుటపడింది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని