మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: నరవణే

భారత నూతన సైనికాధిపతి మనోజ్‌ ముకుంద్ నరవణే గురువారం ఉత్తరాది సరిహద్దుల్లో అత్యంత కీలక ప్రాంతమైన సియాచిన్‌ను సందర్శించారు. సియాచిన్‌ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కలిసి వారితో మాట్లాడారని సైనిక ప్రతినిధి తెలిపారు.

Published : 10 Jan 2020 01:15 IST

శ్రీనగర్‌: భారత నూతన సైనికాధిపతి మనోజ్‌ ముకుంద్ నరవణే గురువారం ఉత్తరాది సరిహద్దుల్లో అత్యంత కీలక ప్రాంతమైన సియాచిన్‌ను సందర్శించారు. సియాచిన్‌ సెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిని కలిసి వారితో మాట్లాడారని సైనిక ప్రతినిధి తెలిపారు. సైనిక ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతికూల వాతావరణంలోనూ అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని నరవణే ప్రశంసించారు. సియాచిన్‌లో ఉన్న సైనికులను చూసి దేశమంతా గర్విస్తోందని ఆయన ప్రశంసించారు. సియాచిన్‌ క్షేత్రంలో కమాండర్‌ నేతృత్వంలో భద్రతాదళాల అప్రమత్తత గురించి ఆయన వివరించారు. ఇకముందూ సైనికులు అంతే ఉత్సాహంతో విధులు నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నరవణే దేశ రక్షణలో భాగంగా సియాచిన్‌ బేస్‌ క్యాంప్‌లో అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. పర్యటనలో నరవణే వెంట లెఫ్టినెంట్‌ జనరల్‌ వైకే జోషి ఉన్నారు. మనోజ్‌ ముకుంద్‌ నరవణే జనవరి 1న భారత సైనికాధిపతిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని