ఇరాక్‌లో తాజా దాడిపై అమెరికా ఆగ్రహం

ఇరాక్‌లో అమెరికా సైనికులు ఉన్న స్థావరాలపై గత రాత్రి జరిగిన దాడిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. తాజా చర్య పట్ల ఆ దేశ విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..........

Published : 13 Jan 2020 09:30 IST

వాషింగ్టన్‌: ఇరాక్‌లో అమెరికా సైనికులు ఉన్న స్థావరాలపై ఆదివారం జరిగిన దాడిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. తాజా చర్య పట్ల ఆ దేశ విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడి వెనక ఉన్న వారిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఇరాక్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇరాక్‌ ప్రభుత్వానికి విధేయులుగా లేని కొంతమంది ఆ దేశ సార్వభౌమత్వంపై తరచూ దాడి చేస్తున్నారని.. దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇరాక్‌లోని ప్రభుత్వ వ్యతిరేకులే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. 

ఇరాక్‌లో అమెరికా బలగాలు మోహరించిన ఒక సైనిక స్థావరంపై ఆదివారం మరోసారి రాకెట్‌ దాడి జరిగింది. బాగ్దాద్‌ సమీపంలోని అల్‌-బలాద్‌ వైమానిక స్థావరంపై ఆదివారం 8 రాకెట్లు పడ్డాయి. ఇందులో ఇరాక్‌ వైమానిక దళానికి చెందిన నలుగురు గాయపడ్డారు. ఇక్కడ కొద్ది సంఖ్యలో అమెరికా సైనికులు, కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా బలగాలు దాదాపుగా ఈ స్థావరాన్ని ఖాళీ చేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని