జామియాను సందర్శించిన ఎన్‌హెచ్ఆర్సీ 

దిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయాన్ని మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) సభ్యులు సందర్శించారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల్లో భాగంగా పోలీసు చర్యల్లో గాయపడిన వారి నుంచి వివరాలను అడిగి రికార్డు చేసుకున్నారు. దాదాపు 35 నుంచి 40 మంది విద్యార్థులు..

Updated : 14 Jan 2020 22:55 IST

దిల్లీ: దిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయాన్ని మంగళవారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్సీ) సభ్యులు సందర్శించారు. పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక నిరసనల్లో భాగంగా పోలీసు చర్యల్లో గాయపడిన వారి నుంచి వివరాలను అడిగి రికార్డు చేసుకున్నారు. దాదాపు 35 నుంచి 40 మంది విద్యార్థులు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులకు తమ వాదనలు వినిపించారు. వర్శిటీలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా? అనే విషయంపై ఎస్‌ఎస్పీ మంజిల్‌ సైనీ నేతృత్వంలో విచారణకు కమిటీని నియమించింది. ఈ బృందం జనవరి 14 నుంచి 17 వరకు విచారణ చేయనుంది. వర్సిటీలో విద్యార్థులపై దాడి జరిగిన సమయంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారని.. గాయపడిన వారికి కనీసం వైద్య సేవలు అందించడానికి కూడా నిరాకరించినట్లు విద్యార్థులు ఎన్‌హెచ్‌ఆర్సీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. గత నెలలో దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని