ఔరా..! టూత్‌పిక్స్‌తో జాతీయ జెండా
ఆయనో పాఠశాల ఉపాధ్యాయుడు.. గణతంత్ర వేడుకల్లో అందరి ఉపాధ్యాయుల్లా పాఠశాలలో జరిగే వేడుకలకే పరిమితం కాదలచుకోలేదు. తన దేశభక్తిని వినూత్నంగా.........
ఓ ఉపాధ్యాయుడి వినూత్న కృషికి నెటిజన్ల సెల్యూట్
అమృత్సర్: ఆయనో పాఠశాల ఉపాధ్యాయుడు.. గణతంత్ర వేడుకల్లో అందరి ఉపాధ్యాయుల్లా పాఠశాలలో జరిగే వేడుకలకే పరిమితం కాదలచుకోలేదు. తన దేశభక్తిని వినూత్నంగా చాటాలనుకున్నారు. అందరిలో ఒక్కడిలా కాకుండా విభిన్నంగా ఏదో ఒకటి చేసి తానేంటో నిరూపించుకోవాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే టూత్‌పిక్స్‌తో జాతీయ జెండాను రూపొందించి ఔరా అనిపించారు. ఆయనే పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఉపాధ్యాయుడు బల్జీందర్ సింగ్. ఈ నెల 26న భారత గణతంత్ర వేడుకలు జరగనున్న వేళ టూత్‌పిక్స్‌తో మువ్వన్నెల జెండాను రూపొందించారు. దీనికోసం ఆయన ఏకంగా 40 రోజుల పాటు శ్రమించి 71వేల టూత్‌పిక్స్‌తో మూడు రంగుల ముచ్చటైన జెండాను రూపొందించి అందరి మన్ననలూ అందుకుంటున్నారు.
ఈ జెండా రూపొందించడంపై బల్జీందర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘చాలా కాలం క్రితం నాకో ఆలోచన వచ్చింది. ఇంతకమునుపెన్నడూ ఎవరూ చేయని విధంగా చేయాలని భావించాను. అలా వచ్చిందే టూత్‌పిక్స్‌తో జాతీయ జెండా రూపకల్పన ఆలోచన. ఇదే పొడవైన జెండా కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఇది పూర్తిచేసేందుకు నాకు 40 రోజుల సమయం పట్టింది. జిల్లా స్థాయిలో జరిగే గణతంత్ర వేడుకల సందర్భంగా దీన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నా’’ అని వివరించారు. మరోవైపు, జాతీయ జెండా తయారు చేయడంలో ఈ ఉపాధ్యాయుడు చేసిన కృషికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘అద్భుతంగా ఉంది.. మీ దేశభక్తికి సెల్యూట్.. బాగా చేశారు సోదరా. .’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్‌ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్‌లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్‌కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్‌కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.