పెరియార్‌ విగ్రహం ధ్వంసం.. ఖండించిన నేతలు

ప్రముఖ సంఘ సంస్కర్త, ద్రవిడ ఉద్యమ నేత ‘పెరియార్‌’ రామస్వామి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సలవక్కంలో....

Published : 24 Jan 2020 23:47 IST

చెన్నై: ప్రముఖ సంఘ సంస్కర్త, ద్రవిడ ఉద్యమ నేత ‘పెరియార్‌’ రామస్వామి విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లా సలవక్కంలో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెరియార్‌ గురించి సినీనటుడు రజనీకాంత్‌ వ్యాఖ్యల నేపథ్యంలో విగ్రహం ధ్వంసం అవ్వడం ఈ ఘటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

పెరియార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ మండిపడ్డారు. తమిళుల కోసం పోరాడిన ఓ వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం నిజంగా సిగ్గు చేటన్నారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెరియార్‌ సహా, ఇతర నేతల విగ్రహాలు ఎవరైనా ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ ఎల్‌కే త్రిపాఠి హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులను అరెస్ట్‌ చేయాలని ఏఎంఎంకే, సీపీఐ, పీఎంకే పార్టీలు డిమాండ్‌ చేశాయి.

ఇదీ చదవండి..
నేను క్షమాపణ చెప్పను: రజనీకాంత్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని