‘భారత్‌ అద్భుత విజయాల్ని అందుకోవాలి’

వివిధ రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాల్లో ఇరు దేశాల మధ్య సహకారం నానాటికీ దృఢమవుతోందని.........

Updated : 28 Jan 2020 11:17 IST

అమెరికా

వాషింగ్టన్‌: వివిధ రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాల్లో ఇరు దేశాల మధ్య సహకారం నానాటికీ దృఢమవుతోందని అభిప్రాయపడింది. తాజా గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపిన అమెరికా.. ఈ దశాబ్దంలో భారత్‌ అద్భుతమైన విజయాల్ని నమోదు చేయాలని ఆకాంక్షించింది. నీరు, వాణిజ్యం, అంతరిక్షం, ఇంధనం, భద్రత తదితర రంగాల్లో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అమెరికా విదేశాంగశాఖలోని దక్షిణ, మధ్య ఆసియా విభాగం స్పష్టం చేసింది. తాజా గణతంత్ర వేడుకల్లో భారత్‌ ప్రదర్శించిన సైనిక పాటవం ఇరు దేశాల మధ్య బంధానికి సూచికగా నిలిచిందని అభిప్రాయపడింది. చినూక్‌, అపాచీ హెలికాప్టర్లను అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. వీటిని తాజా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని