జామియా వర్శిటీ వద్ద కాల్పుల కలకలం

దిల్లీలోని జామియా విశ్వవిద్యాలయ ప్రాంతంలో గురువారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు నిరసనలు చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది.

Updated : 30 Jan 2020 19:29 IST

దిల్లీ: దిల్లీలోని జామియా విశ్వవిద్యాలయ ప్రాంతంలో గురువారం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు ర్యాలీగా వెళ్తుండగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి వారిపై తుపాకీతో కాల్పులకు తెగబడటంతో భయాందోళన వాతావరణం నెలకొంది. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. సీఏఏకు వ్యతిరేకంగా కొందరు విద్యార్థులు జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ నుంచి రాజ్‌ఘాట్‌కు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో నల్లటి కోటు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి తుపాకీ బయటకు తీసి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి బుల్లెట్‌ గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా సమయంలో భారీగా పోలీసులు సైతం అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా జామియా యూనివర్శిటీలో గత నెలలో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని