Updated : 31/01/2020 08:28 IST

కాబోయే భార్య కోసం కాలి నడకన...

డెహ్రాడూన్‌: ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఎంతో అపురూపమైన ఘట్టం. అందులోనూ భారతీయ సమాజంలో వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. తాజాగా ఓ యువకుడు తనకు కాబోయే భార్య కోసం చేసిన పని నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకొంటోంది. ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో బిజ్రా గ్రామానికి చెందిన యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమయింది. అయితే బ్రిజా గ్రామం కొండ ప్రాంతంలో ఉండటంతో ఆ గ్రామానికి సరైన రవాణా సౌకర్యం లేదు. అక్కడికి చేరుకోవాలంటే కాళ్లకు పనిచెప్పాల్సిందే. జనవరి మాసం కావడంతో అక్కడ మంచు కూడా అధికంగా కురుస్తుంది. దీంతో కాలిబాట పూర్తిగా మంచుతో కప్పుకుపోయింది. ముహూర్త సమయానికి వధువు ఇంటికి చేరుకోవడానికి వేరే మార్గం లేకపోవడంతో వరుడు, పెళ్లి బృందం కాలి నడకన కొండలను దాటుకుంటూ నాలుగు కిలోమీటర్లు నడిచి బిజ్రా గ్రామానికి చేరుకున్నారు. ఓ పక్క తీవ్రంగా మంచు కురుస్తున్నపటికీ, ఒక చేత్తో గొడుగును పట్టుకొని పెళ్లి దుస్తుల్లో వరుడు నడుచుకుంటూ వెళుతున్న ఫొటోలను ప్రముఖ వార్తా ఏజెన్సీ ట్విట్టర్లో ఉంచడంతో అవి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ‘అత్యుత్తమ వరుడు అవార్డు ఇతనికే’, ‘ఎంత రొమాంటిక్‌ బంధం’, ‘ప్రేయసి కోసం పాట్లు’ అంటూ సరదా కామెంట్లు పెడుతున్నారు.    


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని